- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రత్తిపాడు జనసేన నేతపై పవన్ సీరియస్.. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచన

దిశ, వెబ్ డెస్క్: మహిళా దినోత్సవం (Womens Day) రోజున ప్రత్తిపాడు (Prathipadu) లో జనసేన నేత (Janasena Leader) చేసిన వీరంగంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సీరియస్ (Serious) అయ్యారు. ప్రత్తిపాడు ఇంచార్జ్ (Prathipadu In-Charge) పై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. శనివారం రోజు ప్రత్తిపాడు జనసేన నాయకుడు తమ్మయ్య బాబు (Janasena Leader Thammaiah Babu) ప్రతిపాడు సీహెచ్సీ (Prathipadu CHC)కి వెళ్లి హల్ చల్ చేశాడు. డ్యూటీ ఉన్న డాక్టర్ ని మహిళ అని చూడకుండా అవమానకరంగా మాట్లాడుతూ.. బీభత్సం సృష్టించాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని మహిళా డాక్టర్ (Women Doctor)తో పాటు పలువురు సిబ్బందిని తమ్మయ్య బాబు హెచ్చరించారు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో జనసేన నేత తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళ దినోత్సవం రోజు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై నోరు పారేసుకోవడం ఏంటని, ఆయనపై తక్షణమే చర్యలు (Take Action) తీసుకోవాలని పలువురి డిమాండ్ (Demand) చేశారు. దీనిపై జనసేన అధిష్టానం (Janasena Higher Authority) స్పందిస్తూ.. ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమ్మయ్య బాబుపై చట్ట ప్రకారం (according to the law) ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులకి సూచించారు. అంతేగాక ప్రత్తిపాడు సీహెచ్సీ వైద్యురాలు డా. శ్వేత (Dr. Swetha) పట్ల జనసేన ఇన్చార్జి తీరుపై విచారించి తక్షణమే నివేదిక (Report) ఇవ్వాలని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడికి (Janasena Kakinada District President) ఆదేశాలు జారీ చేశారు.
READ MORE ...
ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలతో రికార్డ్.. ఎమ్మెల్యేకు మంత్రి లోకేష్ అభినందనలు