పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు.. సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 06:45:21  IST  )

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పనికిరాడని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడు.. సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ డిప్యూటీ సీఎంగా పనికిరాడని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని అన్నారు. పవన్‌ను వెంటనే కేబినెట్ నుంచి బహిష్కరించాలని (లేదా బర్తరఫ్ చేయాలని) డిమాండ్ చేశారు. పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని అన్నారు. ప్రజా నాయకుడిగా పవన్ ఏమాత్రం పనికిరాడని అన్నారు. ‘దిష్టి తగిలింది’ లాంటి మాటలు మాట్లాడే సనాతనవాదికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కుమార్తెను ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనకు చే గువేరా ఆదర్శమని చెప్పిన పవన్.. ఇప్పుడు సావర్కర్‌ను భుజాన వేసుకుని సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నాడని నారాయణ ఫైర్ అయ్యారు.

Next Story