Chandrababu: చంద్రబాబుకు పవన్ ​అభినందనలు.. ఎందుకంటే..

by Thanuru Gopichand |   (  Updated:2025-05-29 05:48:16  IST  )

తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​ అభినందనలు తెలిపారు.

Chandrababu: చంద్రబాబుకు పవన్ ​అభినందనలు.. ఎందుకంటే..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడుకు (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో ఓ పోస్టు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, (TDP) చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందన్నారు. 2024 ఎన్ని కల్లో ఎన్డీయే (NDA) కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత టీడీపీ ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్బంగా 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుకు హృద యపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను 'సైబరాబాద్'గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు,

మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షిం చారు. 1999లో "ఆంధ్రప్రదేశ్ విజన్ 2020" పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు. ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలి..’ అని కోరుకున్నారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్​, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story