Pawan: స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Ramesh Goud |

స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలని, ప్రతీ ఒక్కరిలో చెత్త రహిత సమాజం ఆలోచన రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు.

Pawan: స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలని, ప్రతీ ఒక్కరిలో చెత్త రహిత సమాజం ఆలోచన రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. ఇవాళ గుంటూరు జిల్లా(Guntur District) పెదకాకాని మండలం(Pedhakakani mandal) నంబురూ గ్రామంలో(Nambur Village) నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఎంతో కష్టపడి పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్న 35 మంది పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చెత్త నిర్వహణ పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రజల్లోనూ చైతన్యం రావాలని, ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన రావాలని కోరుకున్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్చ భారత్ అభియాన్(Swacha Bharath Abhiyan) ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సూచించిన విధంగా ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’(Swacha Andra- Swacha Divas) పక్కాగా నిర్వహించాలని, వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలని, చెత్త నుంచి సంపదను సృష్టించాలని సూచించారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటు నిర్వహణ, వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు సైతం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఎస్ఎల్ఆర్ఎమ్ అమలు కోసం స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

Next Story