డిప్యూటీ CMగా పవన్ కల్యాణ్.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..?

by Sathputhe Rajesh |   (  Updated:2024-06-19 07:22:33  IST  )

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.

డిప్యూటీ CMగా పవన్ కల్యాణ్.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో తన‌కు కేటాయించిన శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పవన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఉపాధి హామీ, ఉద్యానవన నిధుల మంజూరుపై పవన్ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. అనంతరం ఐదు శాఖల హెచ్‌వోడీలతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అయితే బాధ్యతలు స్వీకరించే సమయంలో పత్రాలను క్షుణ్ణంగా చదివిన పవన్ ఓ డైరీలో వివరాలను జాగ్రత్తగా రాసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పిఠాపురం టీడీపీ నేత వర్మ పవన్ కల్యాణ్‌ను సత్కరించి నుదిటన తిలకం దిద్దారు.

Next Story