- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విజయవాడకు మూడు టికెట్లు'.. నేను డబ్బులిస్తా అంటే నేనని వాదులాడుకున్న పవన్, లోకేష్
ఏపీలో నేడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నేడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో వెళ్లారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కండక్టర్ తో విజయవాడ మూడు టికెట్లు ఇవ్వండి అని అడిగి, పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోయారు. ఇంతలో అక్కడే ఉన్న లోకేష్.. పవనన్నా డబ్బులు నేనిస్తాను అనగా.. లేదు నేనే ఇస్తాను అని అన్నారు. ఇలా కాసేపు సరదాగా నేనిస్తా అంటే నేనిస్తా అని వాదులాడుకోగా బస్సులో ఉన్నవారంతా చిరునవ్వులు చిందించారు. చివరికి లోకేష్ ఆ టికెట్ల డబ్బులు చెల్లించి, చిల్లర తీసుకున్నారు.
Read More : ఆర్టీసీ బస్సులో చంద్రబాబు, పవన్, లోకేష్ .. ఎక్కడి వరకంటే.
Next Story






