Pavan Kalyan: పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్.. ప్రధాన నిందితుడు అతడే!

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-10 03:26:43  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Pavan Kalyan: పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్.. ప్రధాన నిందితుడు అతడే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan)ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే, గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడి కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం (Deputy CM) పేషీకి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరు (Nellore)కు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. రెండు రోజుల క్రితమే మల్లికార్జున రావు నెల్లూరు (Nellore) నుంచి తిరువూరు (Tiruvur)కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story