Pawan Kalyan : ప్రభల తీర్థాల్లో పవన్ హవా

by Muthe.Rajitha |   (  Updated:2025-01-16 03:44:24  IST  )

సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు(Kodi Pandalu) జోరు గురించి చెప్పాల్సిన పని లేదు.

Pawan Kalyan : ప్రభల తీర్థాల్లో పవన్ హవా
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు(Kodi Pandalu) జోరు గురించి చెప్పాల్సిన పని లేదు. అంతే భారీ ఎత్తున అంబేద్కర్ కోనసీమలో ప్రభల తీర్థాలు(Prabhala Teerthalu) ఘనంగా జరుగుతాయి. దేవుడి ప్రభలను వరిపొలాల మీదుగా ఊర్లన్నీ తిప్పడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే నిన్న జరిగిన కోనసీమ ప్రభల ఉత్సవాల్లో మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ఫ్లెక్సీలే అధికంగా దర్శనం ఇచ్చాయి. ప్రభల్లో ముందుగా శివుడికి ప్రతిరూపమైన వీరభద్రుడి ప్రభలను ఊరేగించగా.. ఆ ప్రభల వెనుక వైపు పవన్ ఫోటోలు ఉంచారు. ఇక వాటి వెంట పీకే ప్రభలను కూడా భారీగా ఊరేగించారు. కొత్తపేట, దేవరపల్లి, అవిడ, ఈతకోటలో పవన్ ప్రభలు ఊరేగిస్తూ.. జనసేన కార్యకర్తలు, అభిమానులు డీజే పాటలతో, మాస్ స్టెప్పులతో మోత మోగించారు.

Next Story