Paul: పవన్ ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. కేఏ పాల్ సంచలన ప్రకటన

by Ramesh Goud |

ఏపీ యాక్టింగ్ సీఎం(Acting CM), యాక్టింగ్ డిప్యూటీ సీఎం(Acting Deputy CM)లపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రకటించారు.

Paul: పవన్ ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. కేఏ పాల్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ యాక్టింగ్ సీఎం(Acting CM), యాక్టింగ్ డిప్యూటీ సీఎం(Acting Deputy CM)లపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రకటించారు. నదుల అనుసందానం విషయంలో కుంభకోణం జరుగుతుందని ఆరోపించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాక్టింగ్ సీఎం మెఘా కృష్ణారెడ్డి(Mega Krishna Reddy), యాక్టింగ్ డిప్యూటీ సీఎం లింగమనేని రమేష్‌(Lingamaneni Ramesh)లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 80వేల కోట్ల నదుల అనుసంధానం, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మెఘా టెండర్‌ ఫిక్సింగ్‌పైన, వేల కోట్ల అవినీతి మీద దర్యాప్తు జరగాలని కోరారు.

సనాతన ధర్మంలో భాగంగా 80వేలకోట్ల కుంభకోణం అని, లింగమనేని రమేష్‌- మెఘా కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు- పవన్‌ కరప్షన్‌ స్కెచ్ ఇది అని, లింగమనేని రమేష్‌, మెఘా కృష్ణారెడ్డి ఇప్పటికే ఎన్ఆర్ఐ మెడికల్‌ కాలేజ్‌(NRI Mwdiacl College) ఆక్రమించారని తెలిపారు. అంతేగాక చంద్రబాబు-పవన్ నదుల అనుసంధాన కార్యక్రమం మరో కాళేశ్వరం కానున్నదని, కాళేశ్వరం ఖర్చు లక్షకోట్లు అని, కాళేశ్వరం మీద సంవత్సరానికి 15వేల కోట్ల వడ్డీ అవుతున్నదని, కాళేశ్వరం ప్రస్తుతం మూతపడిందని చెప్పారు. అలాగే మెఘా కృష్ణారెడ్డి అవినీతికి తార్కాణమైన లిఫ్ట్‌ ఇరిగేషన్‌లన్నీ మూలపడ్డాయని, గత నాలుగేళ్లుగా పట్టిసీమ కరెంట్‌ బిల్లులు కట్టలేక మూతబడిందని వివరించారు. ఇక గ్రావిటీ(Gravity)తో నదుల అనుసంధానం కావాలి, కానీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో, ఎత్తిపోతలతో అనుసంధానం ఒక జోక్ అని, చంద్రబాబు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్‌ అయ్యాడని ఎద్దేవా చేశారు.

ఇది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వేలకోట్ల మెఘా లిఫ్ట్‌ కరప్షన్‌ స్కీమ్‌ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చంద్రబాబు నాయుడికి(CM Chandrababu) సూటి ప్రశ్న వేస్తున్నానని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను గంటలపాటు వెయిట్ చేయించి మెఘా కృష్ణారెడ్డితో మంతనాలు ఎందుకు? అని, ఎన్నివేల కోట్ల డీల్ కుదిరింది? అని అన్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)కు సూటి ప్రశ్న అంటూ.. అవినీతి చక్రవర్తి లింగమనేని రమేష్‌కు, నీకు సంబంధం ఏమిటి? అని, మెఘా కృష్ణారెడ్డితో రహస్య సమావేశాలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న మెఘా కృష్ణారెడ్డి, లింగమనేని రమేష్‌లపై ఈడీ(ED), సీబీఐ(CBI) దర్యాప్తు చేయాలని, లేకుంటే 80వేల కోట్ల నదుల అనుసంధానం కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు ఆమరణ నిరాహారదీక్ష చేపడతాను అని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Next Story