బ్యాంకులను మోసం చేస్తున్న మోసపురెడ్డి.. సీఏం జగన్ పై పట్టాబి ఫైర్

by Disha Web Desk 3 |
బ్యాంకులను మోసం చేస్తున్న మోసపురెడ్డి.. సీఏం జగన్ పై పట్టాబి ఫైర్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు అమరావతి లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇర ఈ సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాక్యలు చేశారు. ప్రాతినిత్యం మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్మోసపు రెడ్డి వారినో వీరినో కాదు ఏకంగా బ్యాంకులనే మోసం చేసేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి అధిపతిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి, నిసిగ్గుగా ఇలాంటి పనులు చేస్తారా అని దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని పేర్కొన్నారు. తనకు తెలిసి దేశ చరిత్రలోనే ఇంత నిసిగ్గుగా జీవోలు విడుదల చేసి మరీ బ్యాంకులను మోసం చేసిన ప్రభుత్వాలు లేవని ఎద్దేవ చేశారు. జీవోలను విడుదల చేసి మరి బ్యాంకులను మోసం చేస్తుందంటే ఈ 420 సర్కార్ ఎంత బరితెగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు.

రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా.. ప్రజలు కోరుకున్న విద్ధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజారాజధానికి శ్రీకారం చుట్టారని.. ఈ నేపథ్యంలో 33 వేల ఎకరాల భూమిని రైలుతులు నిస్వార్ధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు ముందుకు వచ్చి ల్యాండ్ పోలింగ్ విద్ధానంలో ఆనాటి ప్రభుత్వానికి అప్పచెప్పారని హర్షం వ్యక్తం చేశారు.

పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాల భూమిని రాష్ట్రం కోసం త్యాగం చేయగా.. రాజధాని నిర్మానానికి పూనుకున్న చంద్రబాబు రెండువేల ఐదువందల అరవై కోట్లతో ఎమ్మేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా సర్వీసు అధికారులు,ఎన్జీవోలు,జీవోలు నివసించేందుకు గృహసముదాయాలకు శ్రీకారం చుడితే మూడు బ్యాంకులు రెండువేల అరవై కోట్ల రూపాయలను మంజూరు చేశాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రప్రభుత్వం 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించారని వెల్లడించారు.

ఇక రుణాలు తీసుకున్న టీడీపీ అధికారం కోల్పోయే సమయానికి 75 శాతం పనులు పూర్తి చేసారని.. అలానే నిర్మాణానికి అయినా ఖర్చులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ ను కూడా టీడీపీ సబ్మిట్ చేసిందని.. అయితే జగన్ సీఎం అయినా తరువాత రాజధాని లో ఎటువంటి నిర్మాణాలు లేవని.. అంత గ్రాఫిక్స్ అని విషం చిమ్మిన జగన్ రెడ్డి ఈ రోజు 75 శాతం పూర్తయ్యి ఇంకా 25 శాతం నిర్మాణంలో ఉన్న భవనాలను ప్రభుత్వ అధికారులకు కేటాయించినట్లు, అందులో అధికారులు నివాసం ఉంటున్నట్లు.. అందుకు జీఏడీ డిపార్ట్ మెంట్ వాళ్ళు సీఆర్ డీఐ కి అద్దె కూడా చెల్లిస్తున్నారని చెప్తూ బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.





Next Story

Most Viewed