ఆసుపత్రి బిల్డింగ్‌పై నుండి దూకి పేషెంట్ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి చికిత్స కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న గుంటూరు జీజీహెచ్ ఆస్ప‌త్రిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నం శెట్టి శ్రీనివాస్ తాపీమేస్త్రీగా ప‌నిచేస్తున్నాడు.

ఆసుపత్రి బిల్డింగ్‌పై నుండి దూకి పేషెంట్ ఆత్మహత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి చికిత్స కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న గుంటూరు జీజీహెచ్ ఆస్ప‌త్రిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నం శెట్టి శ్రీనివాస్ తాపీమేస్త్రీగా ప‌నిచేస్తున్నాడు. కొద్ది రోజుల నుండి అత‌డిని కిడ్నీ స‌మ‌స్య వేధించ‌డంతో జీజీహెచ్ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. అయితే ఇంత‌లో ఏం జ‌రిగిందో ఏమో కానీ శ‌నివారం ఉద‌యం 6.25 గంట‌ల‌కు ఆస్ప‌త్రి బిల్డింగ్ పై నుండి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుకి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌లేదు. కొంత‌కాలం క్రిత‌మే శ్రీనివాస్ భార్య మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి ఉంటున్నాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story