- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:సంక్రాంతి కానుక.. కీలక బిల్లులకు ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ(Department of Finance)పై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లులు(Pending bills), బకాయిలు చెల్లించేందుకు సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదల పై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు(Students), ఉద్యోగులు(employees), పోలీసు శాఖ(police department)కు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ క్రమంలో చిన్నస్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడం పై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. GPFకు రూ.519cr, CPSకు రూ.300cr, TDSకు రూ.265cr పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241cr, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.788cr, 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506cr, 651 కంపెనీలకు రూ.90cr రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500cr, ఆరోగ్యశ్రీకి రూ.400cr, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేయనున్నారు.






