Parthasarathy: ఆ ప్రశ్నలే జగన్‌‌ను అడిగితే.. గెంటించేవారు: మంత్రి పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు

by Shiva |
Parthasarathy: ఆ ప్రశ్నలే జగన్‌‌ను అడిగితే.. గెంటించేవారు: మంత్రి పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu), మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)పై మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu), జగన్‌ (Jagan)కు మధ్య తేడాను వివరించారు. ఎన్నికల ముందు తాను టీడీపీ (TDP)లో చేరే సమయంలో చంద్రబాబు (Chandrababu)ను కొన్ని ప్రశ్నలు అడిగానని అన్నారు. పారిశ్రామికవేత్తలు (Entrepreneurs), సాఫ్ట్‌వేర్‌ (Software)లకే ప్రధాన్యతను ఇస్తారని, పేదలను పట్టించుకోరనే దుష్ప్రచారం ఉందని అడగ్గా.. అందుకు ఆయన స్పందిస్తూ పరిశ్రమలు (Industries), ఐటీ (IT)తో కుటుంబాలు బాగుపడతాయని నాతో చెప్పారని పార్థసారథి అన్నారు. ఒకవేళ ఇవే ప్రశ్నలు తాను జగన్‌ను అడిగితే పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేశారు. ఏకంగా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఇంట్లోంచి గెంటించేవారని పార్థసారథి ఆరోపించారు.

Advertisement

Next Story