- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. చైర్మన్ కంగ్రాట్స్
ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయసభల్లోనూ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయసభల్లోనూ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్ సభ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సుదీర్ఘంగా చర్చించిన రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో అమరావతి చట్ట బద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పంపనున్నారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణతో..
కాగా ఏపీ పునర్ వ్యవస్థీకరణతో రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అమరావతిని ఏపీ రాజధానిగా బిల్లు తయారు చేసి అప్పటి అసెంబ్లీలో సభ్యులు ఆమోదం తెలిపారు. అటు పార్లమెంట్‌లో కూడా ఆమోదం పొందింది. ఈ మేరకు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే అప్పటికే జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అధికారాన్ని చేపట్టింది. అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కొంత మేర పనులు జరిగాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. వెంటనే అమరావతిపై తన స్టాండ్‌ను మార్చుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాల్సిందేనని పట్టు బట్టింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రాజధాని ప్రాంత రైతుల్లో...
ఒక్కసారిగా రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొంది. రాజధాని కోసం భూమి ఇచ్చి త్యాగం చేస్తే జగన్ ప్రభుత్వం విస్మరించిందని, అమరావతిపై కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. నిరసనలకు దిగారు. సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. ఇంతలో 2024 ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతిని ఏపీ రాజధానిగా శాశ్వతం చేయాలనే ఉద్దేశంతో రాజధాని చట్టబద్ధత బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి పార్లమెంట్ కు పంపింది. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లోనూ తాజాగా అమరావతి చట్ట బద్ధత బిల్లుకు ఆమోదం లభించింది. ఇక ఏపీకి ఏకైక రాజధాని అమరావతిగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో ఏపీలో హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీపై ప్రశంసలు కురుస్తున్నాయి.






