బాలయ్య దేవుడు.. రియల్ హీరో..ఎమ్మెల్యే పరిటాల సునిత ప్రశంసలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-04 17:19:39  IST  )

టాలీవుడ్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌న్ అవార్డు రావ‌డంతో పద్మభూషణుడికి పౌర సన్మానం అనే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

బాలయ్య దేవుడు.. రియల్ హీరో..ఎమ్మెల్యే పరిటాల సునిత ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌న్ అవార్డు రావ‌డంతో పద్మభూషణుడికి పౌర సన్మానం అనే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత, ఎమ్మెల్యే ప‌రిటాల సునిత మాట్లాడుతూ.. బాల‌య్య హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఎన‌లేని సేవ చేస్తున్నార‌ని అన్నారు. ఆయన త‌న త‌ల్లిపేరు మీద బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి పెట్టి ఎంతోమంది క్యాన్స‌ర్ పేషెంట్ల‌కు సాయం చేస్తున్నార‌ని అన్నారు. అక్కడ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. త‌న తండ్రి కూడా బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రిలో చికిత్స పొందారని చెప్పారు. బసవతారకం ఆస్పత్రిలో డాక్టర్లు కూడా గొప్ప సేవ చేస్తున్నారని కొనియాడారు. సినిమాల్లోనే కాకుండా బాల‌య్య రియ‌ల్ హీరో అన్నారు. ఆయ‌న అనంత‌పురం జిల్లాకు ఎంతో సేవ చేశార‌ని హిందూపురం ఎమ్మెల్యేగా ఉండ‌టం అదృష్టం అని చెప్పారు.

Next Story