ఎవరు కన్న బిడ్డో.. ఇలా బకెట్‌లో ప్రత్యక్షం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-23 10:43:34  IST  )

ప్రకాశం జిల్లాలో పసికందును బకెట్‌లో ఉంచి తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోయారు...

ఎవరు కన్న బిడ్డో.. ఇలా బకెట్‌లో ప్రత్యక్షం..!
X

దిశ, వెబ్ డెస్క్: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువు(baby) బకెట్‌లో ప్రత్యక్షమైంది. బొడ్డు కూడా సరిగా ఊడని పసికందుపై తల్లిదండ్రులు(Parents) కనికరం చూపలేదు. అత్యంత దారుణంగా ఒంటరిని చేసి వెళ్లిపోయాలు. నవమాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి.. పుట్టిన గంటల్లోనే తల్లి కూడా వదిలించుకున్నారు. కళ్లు తెరవని ఆ పసికందు ఆలానా పాలన ఎవరు చూడాలి. కడుపు నిండా పాలు తాపి జోల పాడేదెవరు..?... ప్రకాశం జిల్లా(Prakasam District)లో పసికందును వదిలి వెళ్లిపోయిన ఘటన సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు(Giddaluru)లో అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును బకెట్‌లో పడవేసి వెళ్లిపోయారు. కళ్లు కూడా తెరవని పసికందును స్థానికులు గమనించారు. మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు.. పసికందును స్వాధీనం చేసుకున్నారు. పాలు తాగించి నిద్ర పుచ్చారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. పసికందుకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

అయితే శిశువును వదలివెళ్లిన తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా సరే వెంటనే వచ్చి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

Next Story