మమ్మల్ని వదిలేయండి: పరకామణి చోరీ నిందితుడు తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-06 11:00:15  IST  )

తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేయకండని పరకామణి చోరీ నిందితుడు రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు..

మమ్మల్ని వదిలేయండి: పరకామణి చోరీ నిందితుడు తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేయకండని పరకామణి చోరీ(Parakamani theft) నిందితుడు రవి కుమార్(Ravi Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పునకు కుటుంబమంతా మనోవేదనకు గురవుతున్నామని ఆయన తెలిపారు. పరకామణి చోరీపై తొలిసారి రవికుమార్ స్పందించారు. 2023, ఏప్రిల్ 29న పరకామణిలో తప్పు చేశానని, ఇందుకు ఫ్యామిలీ మొత్తం బాధపడ్డామని చెప్పారు. ప్రాయశ్చిత్తంగా 90 శాతం ఆస్తిని దేవుడికి ఇచ్చేశానని తెలిపారు. టీటీడీ(TTD)కి తన ఆస్తిని ఇచ్చిన తరువాత కొంత మంది బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు. అంతేకాకుండా అవాస్తవాలు కూడా ప్రచారం చేశారని రవి కుమార్ వాపోయారు. కోర్టు ఆదేశాలతో తానను ఏ పరీక్ష చేసిన అందుకు సిద్ధంగా ఉన్నానని రవి కుమార్ స్పష్టం చేశారు.

Next Story