- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపికొండలు విహార యాత్ర నిలిపివేత.. కారణం ఇదీ..
by Thanuru Gopichand |
రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఇప్పటికే 10.50 అడుగులకు నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లు అధికారులు స్వల్పంగా ఎత్తారు. బ్యారేజ్ నుంచి 8.23 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేశారు. అలాగే పాపికొండల విహార యాత్రను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా.. పాపికొండల మధ్య గోదావరిలో బోటు షికారు చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహార యాత్ర ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది.
Next Story






