- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది: పవన్ కళ్యాణ్
ఏపీలో ఎన్డీయే కూటమి పాలన మొదలయ్యాక పంచాయతీరాజ్ శాఖ(Department of Panchayat Raj)లో పలు మైలురాళ్లు దాటామని డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి పాలన మొదలయ్యాక పంచాయతీరాజ్ శాఖ(Department of Panchayat Raj)లో పలు మైలురాళ్లు దాటామని డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా తెలిపారు. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే విశేష విజయాలు సాధించిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 1800 కి.మీ సీసీ రోడ్లను(Construction of CC roads) నిర్మించగా.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే 3750 కి.మీ రోడ్లను నిర్మించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతికి దోహదపడ్డాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తక్కువ కాలంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి(development of rural areas) పెద్దపీట వేసిందని తెలిపారు. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా ఎన్డీయే హయాంలో 22,500 నెలకొల్పామని తెలిపారు. PVTG ఆవాసం కోసం వైసీపీ రూ.91 కోట్లు వెచ్చిస్తే మా సర్కారు 6 నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు పెట్టింది అని వెల్లడించారు.






