- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు | సత్తెనపల్లిలోని పురాతన ఆలయాల్లో చోరీ
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో (Sattenapalli) అపవిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రెండు పురాతన ఆలయాలను (Ancient Temples) లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో (Sattenapalli) అపవిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రెండు పురాతన ఆలయాలను (Ancient Temples) లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని శివాలయం, అలాగే వేణుగోపాల స్వామి గుడిలో దొంగలు హుండీలను పగులగొట్టి అపహరించుకుపోయారు. ఈ రెండు ఆలయాలు చారిత్రక ప్రాధాన్యత కలిగినవి కావడంతో ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి వేళల్లో ఆలయాల తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, భక్తులు సమర్పించుకున్న కానుకలు ఉండే హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగతనానికి పాల్పడిన విధానం, వారి ముఖాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
ఈ చోరీ ఘటనపై స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పురాతన ఆలయాలకు కూడా రక్షణ కరువైందని వాపోయారు. తక్షణమే దొంగలను పట్టుకుని హుండీలను, ఆలయ సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా సత్తెనపల్లిలో దొంగతనాలు జరిగాయని, వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే సత్తెనపల్లిలో చోటుచేసుకున్న ఈ వరుస దొంగతనాల పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంది. దోషులను త్వరగా పట్టుకోవడంతో పాటు ఆలయాలకు భద్రతను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.






