వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ

by Ajay Maddhiboyina |

వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు విచ్చేసిన 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు నోటీసులు జారీ చేశారు.

వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు విచ్చేసిన 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు నోటీసులు జారీ చేశారు. పీడీపీపీ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ తీశారని, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఆదివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ పర్యటనలో జగన్ కారు ఢీ కొట్టడం వల్ల సింగయ్య అనే వ్యక్తి మరణించాడని ఆయనపై కేసు నమోదైంది. దీంతో కూటమి నేతలు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కారు ఢీ కొట్టినా ఆపకుండా వెళ్లారని మండిపడుతున్నారు. జగన్ పర్యటనకు అనుమతి లేదని చెబుతున్నారు. కూటమి నేతలు ఇలా విమర్శలు చేస్తుంటే...వైసీపీ నేతలు మాజీ సీఎం అయిన జగన్‌కు ప్రభుత్వం జెడ్ సెక్యురిటీ భద్రత కల్పించకపోవడం ప్రభుత్వం వైఫల్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story