- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్నాడు | భార్యను చంపాడు.. బైకుపై తీసుకెళ్లాడు
కలకాలం కలిసి ఉండాల్సిన కొందరు భార్యభర్తలు కలహాల కాపురంతో ఇంటిని కుంపటిగా మారుస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కలకాలం కలిసి ఉండాల్సిన కొందరు భార్యభర్తలు కలహాల కాపురంతో ఇంటిని కుంపటిగా మారుస్తున్నారు. కుటుంబాలను బజారుకీడుస్తున్నారు. పరస్పర వివాదాలతో దాంపత్య జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో భర్తను భార్య చంపుతుండగా, మరికొన్ని సందర్భాల్లో భర్త భార్యను చంపుతున్నాడు. ఇలా అనుమానాలు, అపనమ్మకాలతో, ఆవేశాలతో సంసార జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నారు. అటువంటి ఓ ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన రొంపిచర్ల మండలం మాచవరంలో చోటు చేసుకుంది. పెళ్లైన పదేళ్ల తరువాత ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇరు కుటుంబాల్లో విషాదాన్ని, వారు కన్న ఇద్దరు బిడ్డల జీవితాల్లో చీకట్లను నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు పదేళ్ల క్రితం మహాలక్ష్మిని ప్రేమించాడు. వారి ప్రేమ బలపడడంతో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారికి ఇద్దరు సంతానం కలిగారు. అంతా సజావుగా సాగుతుందునుకున్న క్రమంలో భార్యభర్తల మధ్య పొరపచ్చాలు రేగాయి. వారి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో మహాలక్ష్మి మాచవరంలో ఉంటోంది. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు కోపతాపాలు పెరిగాయి. వెంకటేశ్వర్లు మాచవరంలోని భార్య వద్దకు వెళ్లాడు. ఆమెను మాచవరం శివారులోని రొంపిచర్లకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఇరువురు గొడవపడ్డారు. గొడవ ముదరడంతో భార్య మహాలక్ష్మిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ దాడిలో మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృత దేహాన్ని బైకుపై ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా సంతమాగులూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అక్కడి పోలీసులు సమాచారాన్ని రొంపిచర్ల పోలీసు స్టేషనుకు చేరవేశారు. దీంతో రొంపిచర్ల పోలీసులు సంతమాగులూరు చేరుకొని మహాలక్ష్మి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






