- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు : బాలికకు వేధింపులు.. ఇద్దరి అరెస్ట్
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధించారు ఇద్దరు యువకులు. వారిలో హద్దలు దాటి బెదిరింపులకు కూడా దిగాడు.

దిశ, వెబ్ డెస్క్ : తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధించారు ఇద్దరు యువకులు. వారిలో హద్దలు దాటి బెదిరింపులకు కూడా దిగాడు. యాసిడ్ పోస్తానంటూ బాలికను భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదంతా భరించలేని ఆయన బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో (Sattenapalli) చోటు చేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం సత్తెనపల్లికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లొస్తూ ఉంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల కన్ను ఆమెపై పడింది. ఇక అది మొదలు ప్రేమ పేరుతో బాలికను వేధించడం (Harrasing Minor Girl) ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లొచ్చే క్రమంలో విద్యార్థిని వేధింపులకు గురి చేసేవారు. నిత్యం వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక ఇబ్బందులకు గురయ్యేది. తనలో తాను వేదనను అనుభవించేది. ఈ క్రమంలో ఇద్దరు యువకుల్లోని ఓ యువకుడు బాలికను బెదిరించాడు. ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఆ బాలిక భయభ్రాంతులకు గురైంది. విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితులైన కోటేశ్వర రావు (20), కోటయ్య (21)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.






