జగన్ పర్యటనలో ఉల్లంఘనలు.. ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఎమ్మెల్యే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు...

జగన్ పర్యటనలో ఉల్లంఘనలు.. ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్(YS Jagan) సత్తెనపల్లి పర్యటన(Sattenapalli tour)లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో జగన్‌కు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ కాన్వాయ్‌తో పాటు మొత్తం 30 వాహహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని, అయితే ఈ ఆంక్షలకు విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించారని ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) తెలిపారు. ‘‘ జగన్ పర్యటనలో చాలా ట్రఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.పోలీసులను అసభ్యరంగా మాట్లాడారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనవాసరావు పేర్కొన్నారు.

Next Story