- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబం ఆత్మహత్యాయత్నం... తల్లీకుమార్తె మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu) నరసరావుపేట(Narasaraopet)లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లి శంకరకుమారి, ఆమె మూడేళ్ల కుమార్తె మౌనిక మృతి చెందగా, తండ్రి గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Next Story






