- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పళని To తిరుమల.. భక్తులకు మెరుగైన రవాణా కల్పిస్తాం..
దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా శుక్రవారం పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు దర్శించుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా శుక్రవారం పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు దర్శించుకున్నారు. రోప్ వే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి క్షేత్రాన్ని దర్శించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వెలుపల పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడం పై దృష్టి పెడతాం అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియచేస్తానని వెల్లడించారు. టీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాను అని తెలిపారు. అలాగే పళని నుంచి కూడా తిరుమలకు కూడా తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతాం అన్నారు. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలని తలంపుతో ఇక్కడికి వచ్చాను. ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదని ఆయన వివరించారు.






