ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలకు పాక్ ఆర్మీ : ఎంపీ లావు

by Naga Rani Yarlagadda |

ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన అంశాల గురించి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu) వెల్లడించారు.

ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలకు పాక్ ఆర్మీ : ఎంపీ లావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన అంశాల గురించి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu) వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్మీ ఫోర్స్ (Indian Army) నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి చర్చించామని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఎలా అటాక్ చేశారన్న దానిని రాజ్ నాథ్ వివరించారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ఆర్మీ (Pak Army) ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలకు ఎలా వెళ్లారో చెప్పారన్నారు. భారతీయులుగా అందరం కలసికట్టుగా ఉండాల్సిన సమయం అని, ఇండియన్ ఆర్మీకి అందరం మద్దతుగా నిలబడుదామని కోరారు. అలాగే పాక్ పై ఒత్తిడి తీసుకువచ్చేలా వారికి అందుతున్న నిధులు, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతున్న సహాయాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇద్దరు మహిళా అధికారులు మీడియా బ్రీఫింగ్ లో పాల్గొన్న విషయాన్ని అందరూ ప్రశంసించారన్నారు.

భారత సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చర్చించామన్నారు. కాగా.. పాక్ ఎదురుదాడులకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని, ఇప్పటి వరకూ ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. పాక్ సైన్యం భారత పౌరుల్ని టార్గెట్ చేస్తోందని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించామని ఎంపీ లావు తెలిపారు.

Next Story