- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి సాయంత్రం శ్రీవారికి గరుడవాహన సేవ.. తిరుమల కొండపై లక్షలాది భక్తులతో నిండిన గ్యాలరీలు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీనివాసుడు.. సాయంత్రం గరుడవాహనంపై (Garuda Vahana Seva) తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీనివాసుడు.. సాయంత్రం గరుడవాహనంపై (Garuda Vahana Seva) తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి స్వామివారు గరుడవాహనంపై విహరించనుండగా.. వేకువజాము నుంచే భక్తులు భారీగా గ్యాలరీల్లోకి చేరుకున్నారు. ఇప్పటికే లక్షకు పైగా భక్తులు గ్యాలరీల్లో ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేశారు. గరుడవాహనసేవను 2 లక్షలమంది వీక్షించేలా ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల మధ్య ఎలాంటి గొడవలు, తొక్కిసలాటలు జరగకుండా 5 వేల మంది భద్రతా సిబ్బందితో నిఘా ఉంచింది. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికి ఒక బస్సు సేవలందించేలా చర్యలు తీసుకుంది. రెండున్నర లక్షల మంది భక్తులు రాకపోకలు సాగించేలా బస్సులు నడుపుతున్నట్లు టీటీడీ తెలిపింది.
గరుడవాహన సేవను వీక్షించేందుకు వచ్చే ప్రతి భక్తుడికి టీటీడీ సేవలను అందించాలని జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలోని గ్యాలరీలలో, జౌట్ సైడ్ క్యూలైన్లు, వీక్యూసీ -2 క్యూలైన్లు, బయట ప్రాంతాలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలు అందేలా ముందస్తుగా నిల్వ ఉంచుకుని ప్రణాళిక బద్ధంగా పంపిణీ చేయాలని సూచించారు. పరిష్కరించలేని సమస్య ఏదైనా తలెత్తితే తక్షణం ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
కాగా.. ఆదివారం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గర్లో ఉన్న ఆక్టోపస్ భవనం వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని, టోకెన్లు లేని భక్తులకు మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది. నిన్న (శనివారం) శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకోగా.. 45,413 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.






