- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh : చేనేతలకు మాకు ప్రాణ సమానం
మంగళగిరి వాసులు నాపై చూపిన ప్రేమను ఎన్నటికీ మరిచిపోలేనదని మంత్రి నారా లోకేశ్తెలిపారు

దిశ, డైనమిక్ బ్యూరో : మంగళగిరి వాసులు నాపై చూపిన ప్రేమను ఎన్నటికీ మరిచిపోలేనదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులు నాకు ప్రాణ సమానం అన్నారు. వారు కార్మికులు కాదు.. కళాకారులు అని తెలిపారు. మంగళగిరి చేనేతలు నా కుటుంబ సభ్యులు అన్నారు. చంద్రబాబు సహకారంతో ప్రతిపక్షంతో ఉన్నపుడు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కరోనా సమయంలో చేనేత కార్మికులకు అండగా నిలిచానని అన్నారు. చేనేత ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. అదే విధంగా స్వర్ణకారులను ఆదుకున్నామని అన్నారు. నేను ప్రధాన మంత్రిని కలిసినపుడు వారికి ఇచ్చేది మంగళగిరి చేనేత వస్త్రాలు అని తెలిపారు. బ్రాహ్మణి కట్టుకున్న చేనేత చీర ఆ తర్వాత అదే షాపులో 90 మంది కొన్నారని వివరించారు. మంగళగిరిలో ట్రిపుల్ఇంజన్సర్కారు నడుస్తుందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, మంగళగిరి గల్లీలో ఈ లోకేష్ ఉన్నారని తెలిపారు.






