- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీపైనే మా పోరాటం.. వైఎస్ షర్మిల
రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీపైనే మా పోరాటం ఉంటుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress President YS Sharmila) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీపైనే మా పోరాటం ఉంటుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress President YS Sharmila) స్పష్టం చేశారు. ఈ నెల 9న ఏఐసీసీ (AICC) ఆధ్వర్యంలో అహ్మదాబాద్ (Ahmedabad) లో జరిగిన మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అమలు చేయబోయే తదుపరి కార్యక్రమాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. దీనిపై ఇవాళ ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ పీసీసీ రాఘువీరా రెడ్డి (RaghuVeera Reddy) సహా ఏపీ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మహనీయుడు డా. బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) రాసిన రాజ్యాగాన్ని బీజేపీ అడుగడుగున అవమానాలకు గురి చేస్తుందని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ (BJP)పై పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. అలాగే బీజేపీ చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా.. ప్రజల ముందు బీజేపీ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు.
ఇక అహ్మదాబాద్ రిజల్యూషన్ (Ahmedabad Resolution)ను గడప గడపకు తీసుకెళ్లాలని, అందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా 40 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయంపై క్యాంపైన్ చేయాలని అన్నారు. రాజ్యాంగం సమాన హక్కులు అందరికీ కల్పించింది. కానీ కొందరికే మేలు చేసేలా బీజేపీ పాలన ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతం న్యాయ పథ్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పోరాటం ఉంటుందని షర్మిల వ్యాఖ్యానించారు.






