మా కుటుంబాన్ని వేధిస్తున్నారు : పోలీసులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు

by Seetharam |   (  Updated:2023-09-14 09:04:06  IST  )

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

మా కుటుంబాన్ని వేధిస్తున్నారు : పోలీసులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సోషల్ మీడియా వేదికగా తమను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గురువారం గన్నవరం పోలీస్ స్టేషన్‌ చేరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని అసభ్యకరంగా దూషిస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కెనడాలో చదువుతున్న యనమదల సందీప్ అనే వ్యక్తి తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు యనమదల సందీప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వల్లభననేని వంశీమోహన్ ఫిర్యాదులో కోరారు. ఇకపోతే వల్లభనేని వంశీమోహన్ 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీమోహన్ వైసీపీకి అనుమబంధంగా మారిపోయారు.

Next Story