- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: ఒకప్పుడు చెట్టే మన అడ్రస్.. మళ్లీ ఆ పరిస్థితి రావాలి.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
చెట్టు మనకు ఆధారం.. చెట్లు ఆనవాళ్లు.. అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : చెట్టు మనకు ఆధారం.. చెట్లు ఆనవాళ్లు.. అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు. అమరావతి, తుళ్ళూరు మండలం, అనంతవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం (Environment Day) సం దర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ ను వారిద్దరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల అటవీ పరిర క్షణకు పనిచేస్తున్న కొమెర అంకారావు సేవలను ఆయన కొనియాడారు. కనీసం నేను కోటి మొక్కలు నాటితే నాకు ఇక్కడ మాట్లాడే అర్హత వస్తుందన్నారు. నాకు ప్రస్తుతానికి ఆ అర్హత లేదన్నారు. వచ్చే ఏడాదికి నేను అంకారావు మాదిరిగా చెట్లు నాటి పర్యావరణం మీద సాధికారికంగా ప్రసంగిస్తాను అన్నారు. .ఒకప్పుడు చెట్టే అడ్రస్.. ఎవరైనా ఇళ్ల అడ్రస్ చెప్పేటప్పు్డు మా ఇంటి ముందు గోరింటాకు చెట్లుందని, బిళ్ల గన్నేరు చెట్టుందని ఇలా చిరునామా చెప్పే వాళ్లం. ఇప్పుడు చెట్టు కు అడ్రస్ కరువవుతోంది. ఆ పరిస్థితిని సీఎం చంద్రబాబునాయుడు మార్గదర్శకంలో మార్చాలని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. పండ్లు, హ్యాండ్లూమ్ , పొట్టు వంటి పలు రకాల వేస్ట్‌లతో తయారు చేసిన పలు ఉత్పత్తుల స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు పరిశీలించారు. తిరుమల శేషా చలం అడవుల్లో లభించే ఎర్ర చందనం చాలా విలువైందని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వద్ద అప్పట్లో ఉన్న ఎర్రచందనం విలువ లక్ష కోట్లకు పైగా అంచనా వేస్తే .. అది ఎక్కడో మిస్సయిందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రతి స్టాల్ నిలబడి ఆ ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా పిచ్చుక గూళ్ల కోసం రూపొందించిన కుండలపై ఆయన ఆసక్తి చూపారు. పిచ్చుకల సంతానోత్పత్తి కోసం రూపొందించిన వాటిని అన్ని నగరవనాలు, పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా 142 ఏళ్ల వృక్షం గురించి ఫారెస్ట్ అధికారులు వివరించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వందేళ్లకు పైబడిన వృక్షాల సంఖ్య గురించి సీఎం ఆరా తీశారు. ఆ వృక్షాల డేటాను సేకరించాలని ఆయన ఆదేశించారు.






