- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు అరెస్ట్
ఏపీలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వేసి వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వేసి వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్య సెట్ వేసి ఒక్కో టికెట్ రూ.2,999లకు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అంతే కాకుండా దర్శనం టికెట్ రూ.50, చెప్పులకు రూ.5 అంటూ భారీగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా కల్యాణోత్సవం పేరుతో మరో దోపిడీకి తెరలేపారు.
కల్యాణానికి భద్రాద్రి ఆలయం నుండి పండితులు వస్తారని ప్రచారం చేశారు. నిర్వాకులపై విశాఖ కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి స్పందించారు. విశాఖ సెట్‌లో కల్యాణోత్సంతో తమకు సంబంధం లేదని అన్నారు. కల్యాణానికి తెలంగాణ దేవాదాయశాఖ అనుమతి ఉండాలని చెప్పారు. భద్రాద్రి నుండి పండితులు వస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.






