ప్రభుత్వ ఏడాది పాలన వేడుకలు: నిన్న వేదిక.. నేడు పేరు మార్పు

by Vemula.Srinu Prasad |

ఏపీలో ప్రభుత్వ వేడుకల సభ పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి...

ప్రభుత్వ ఏడాది పాలన వేడుకలు: నిన్న వేదిక.. నేడు పేరు మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్(Suparipalana-Swarnadhra Pradesh) అనే పేరును ఖరారు చేశారు. విజయవాడ(Vijayawada) కేంద్రంగా ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరిగిన విమానం ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. శుక్రవారం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున మంగళగిరిలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు వేదికను రెడీ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల విజయవాడకు మార్చారు. అంతేకాదు వేడకులకు సంబంధించిన సభ పేరును మార్పు చేశారు. సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ బదులుగా సుపరిపాలన-తొలి అడుగు అంటూ వేడుకల వేదిక పేరును మార్పు చేశారు. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story