- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
by Phanindra |
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు ఆహ్వానం అందజేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీరామ నవమి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు ఆహ్వానం అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేశారు. కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుందని వివరించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 09 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి అందించారు.
Next Story






