- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తర్వాతే భూములు ఇవ్వండి : మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్
రాజధాని రైతులకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక సూచనలు.

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) జిల్లా మందడం గ్రామంలో జరిగిన మందడం ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Mandadam Farmers Welfare Association) సమావేశం జరిగింది. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర (AB Venkateswara Rao) రావు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. సమావేశంలో రైతులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలను చేశారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంత మహిళలపై జరిగిన వేధింపుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి మహిళలు ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వారిపై దాడులు జరిగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగా అందాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టబోయే రెండో విడత భూసేకరణపై రైతులకు ముఖ్యమైన సూచనలు చేశారు. రెండో విడతలో భూములు ఇచ్చే ముందు రైతులు ప్రభుత్వం ప్రకటించే విధివిధానాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీలు, ప్లాట్ల కేటాయింపు, భవిష్యత్తు ప్రయోజనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే భూములు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని రాజధాని నిర్మాణంలో తమకు ఎదురవుతున్న సమస్యలను గురించి చర్చించారు.






