- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Two Brides: వరుడు ఒక్కడే.. వధువులు ఇద్దరు.. ఏపీ శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన.. పెండ్లి కార్డు వైరల్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక (wedding card) ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. సాధారణంగా దేశంలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని మాత్రమే భార్యగా స్వీకరించగలరు. కానీ అందుకు భిన్నంగా ఏపీలో ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇద్దరితో కలిసి జీవించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని (Sri Satya Sai district) శ్రీసత్యసాయి జిల్లాలో ఈ విశేశం చోటు చేసుకుంది. వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు అంటూ నిడింగింటి వారి పెండ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఎన్ గంగరాజు అనే వరుడికి చిక్కబళ్లాపురం జిల్లా, బాగేపల్లి టౌన్‌కు చెందిన అక్కా చెల్లెళ్లు కె. శ్రీలక్ష్మీ, కె. ఐశ్వర్య అనే యువతులను ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు పెళ్లిపత్రికలో ముద్రించారు.
ఒకే పెళ్లి మండపంలో వేద మంత్రాల సాక్షిగా, భాజా భజంత్రీల నడుమ ఈ నెల 10 వ తేదీన జిల్లాలోని గోరంట్ల టౌన్‌లో గురువారం ఈ పెండ్లి వేడుకలు ఘనంగా చేయబోతున్నట్లు పత్రికలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే పెండ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకరిని పెళ్లి చేసుకొని సంసారం సాగరం ఈదలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే.. ఈ వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నడంటే ఆ గుండే గట్టిదని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఇటీవల తెలంగాణలో ఒక వరుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సిడాం సూర్యదేవ్‌కు లాల్ దేవి, జలకర్ దేవీలను వివాహం చేసుకుని వైరల్ అయ్యారు.






