అలా మాయ చేయడం బాబుకే తెలిసిన విద్య.. అవరావతి భూసేకరణపై షర్మిల సంచలన విమర్శలు

by Ramesh Goud |

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) తీరు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS sharmila) ఎద్దేవా చేశారు.

అలా మాయ చేయడం బాబుకే తెలిసిన విద్య.. అవరావతి భూసేకరణపై షర్మిల సంచలన విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) తీరు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS sharmila) ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి (AP Capital Amaravathi Devolopement) కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల.. కూటమి ప్రభుత్వం (Coalition Government)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదని, పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అందులో అద్భుత ప్రపంచం కడతాడట అంటూ.. అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ (AI) పేరుతో గ్రాఫిక్స్ (Graphics) మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య అని ఘాటు విమర్శలు చేశారు. రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్ళీ అగ్గువకే కాజేసి, తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) చేయాలని చూసే కుట్ర తప్ప మరోటి కాదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదని. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదని దుయ్యబట్టారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం అంటూ.. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదని, అఖండ అమరావతికి మోకాలడ్డు మా ఉద్దేశ్యం అంతకన్నా కాదు, కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? అని ప్రశ్నించారు. కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు, ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం?, సింగపూర్ (Singapur) తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ? అని నిలదీశారు. ఇక రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా.. చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? అని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటని, సీడ్ క్యాపిటల్ (Seed Capital) కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంస్థలకు కేటాయించారు?, ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు.

Next Story