ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌.. 8 మంది అరెస్ట్

by Vemula.Srinu Prasad |

గుంటూరు పట్టాభిపురంలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు..

ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌.. 8 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు పట్టాభిపురంలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది.10 ఏళ్లుగా స్థానికులు శ్రీనివాసరావు, విజయభాస్కర్‌రెడ్డి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో నిందితుల ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు ప్రధాన నిందితులు, బెట్టింగ్‌లో పాల్గొన్న మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.13.60 లక్షలు, 8 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల ఖాతాల్లో నిల్వ ఉన్న రూ.5 లక్షలను సీజ్ చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Next Story