- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోనసీమ జిల్లాలో టెన్షన్.. టెన్షన్..: లేఖ విడుదల చేసిన ఓఎన్జీసీ
by Vemula.Srinu Prasad |
కోనసీమ జిల్లా ఘటనపై ఓఎన్జీసీ లేఖ విడుదల చేసింది...

X
దిబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District) ఇరుసుమండ గ్రామం(Irusumanda)లో గ్యాస్ లీక్(Gas Leak) అయిన విషయం తెలిసిందే. అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికే స్థానిక గ్రామ ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నారు. మొత్తం 600 కొబ్బరి చెట్ల వరకూ అగ్నికి ఆహుతయ్యారు. ఈ నేపథ్యంలో ఓఎన్‌సీజీ (Ongc)అధికారులు లేఖ విడుదల చేసింది. ఘటన జరిగిన దగ్గర నుంచి 600 మీటర్ల వరకూ నివాస ప్రాంతం కాదని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్, మంటలను అదుపు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్యాన్ లీక్‌ను అరికడతామని, ఇందుకు సంబంధించి అంతర్జాతీయ నిపులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఘటనా స్థలం పరిస్థితిని తమ కంపెనీకి చెందిన సీనియర్ నిపుణులు పర్యవేక్షిస్తున్నారని లేఖలో ఓఎన్జీసీ అధికారులు పేర్కొన్నారు.
Next Story






