అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్

by Thanuru Gopichand |

మలికిపురం మండలంలో మరోసారి గ్యాస్ లీక్. ఆందోళనలో గ్రామస్తులు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
X

దిశ, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లాలో (Konaseema District) తరచూ గ్యాస్ పైప్ లైన్ లీకులు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని పైప్ లైన్ (Pipeline) వ్యవస్థ ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇటీవలే మలికిపురం (Malikipuram) మండలం ఇరుసుమండలో గ్యాస్ బ్లోఅవుట్ (Gas Blowout) జరిగింది. దాన్ని ఆర్పేందుకు రోజులపాటు ఓఎన్జీసీ (ONGC) అధికారులు, విపత్తు నివారణ సిబ్బంది, జాతీయ స్థాయి నిపుణులు ఇబ్బందిపడ్డారు. అయితే మరోసారి మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. మండలంలోని తూర్పుపాలెంలో (Turpu Palem) గ్యాస్ లీకవ్వడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈసారి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజీని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వారిని సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలను అధికారులు చేపడుతున్నారు.

Next Story