- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Irusumanda Blowout: ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లో అవుట్.. ఇంకా ఆరని మంటలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు నేటికీ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు నేటికీ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. మూడు రోజులుగా మంటలను నియంత్రించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలంలో వాటర్ స్ప్రింక్లింగ్‌తో పాటు ఫైరింజన్లు, భారీ వాటర్ క్యానన్ల ద్వారా నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ లీక్
సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఇరుసుమండలోని మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ ఏర్పడి మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటల ఉద్ధృతి కొంత మేర తగ్గిందని, సహజ వాయువు సాధారణ స్థాయిలో మండుతోందని అధికారులు పేర్కొన్నారు.
నిపుణుల బృందం పరిశీలన
గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడుతోందో గుర్తించేందుకు నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టింది. బ్లో అవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ సంస్థకు చెందిన నిపుణులు ఒకటి రెండు రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని కలెక్టర్ ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.






