- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తుకు వన్ టైం డిలీట్' సదుపాయం
by Malleboina Mahesh |
టెట్ అప్లికేషన్ల సవరణకు జూలై 2 నుండి 5 వరకు 'వన్ టైం డిలీట్' అవకాశం.. ఆధార్, ఫోన్ నంబర్ మినహా మిగతా వివరాల మార్పునకు ఉచిత ఛాన్స్!

X
దిశ, వెబ్ డెస్క్: ఆంద్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ అయింది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పిదాలు ఉంటే సరి చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక్కసారి డిలీట్ ఆప్షన్ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. 'వన్ టైం డిలీట్ ఐచ్చిక సౌకర్యాన్ని ఉపయోగించుకొని సరైన వివరాలతో దరఖాస్తు ఫిల్ చేసి.. తిరిగి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వన్ టైం డిలీట్ ఐచ్చికంలో ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మినహా మిగతా అన్ని అంశాలను సరి చేసుకోవడానికి అవకాశమిచ్చామపి. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Next Story






