- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. వ్యక్తి మృతి
జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.

X
దిశ,వెబ్‌డెస్క్: జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన కొత్తవలస మండలం ముసిరాంలో వెలుగు చూసింది. ఆస్తి వివాదంలో బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ముదరడంతో నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. సమీప బంధువు కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు. గడిచిన వారం రోజుల్లో గన్ ఫైరింగ్స్‌లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Next Story






