- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని నగరంలో ‘‘పవర్’’ కష్టాలు.. గత ఐదేళ్లే బెస్ట్ అంటూ కామెంట్స్
అమరావతి రాజధాని నగరాల్లో ఒకటైన గుంటూరులోని పలు ప్రాంతాల్లో కరెంట్ కట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని నగరాల్లో ఒకటైన గుంటూరు(Guntur)లోని పలు ప్రాంతాల్లో కరెంట్ కట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా నిత్యం ఏదో ఒక సమయంలో గంటకు పైగా కరెంటు కోతలు ఉంటున్నాయి. దీంతో విద్యుత్ శాఖపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రకటికతంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం మిట్ట మధ్యాహ్నం మూడు గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేశారని, అసలే ఎండలు మండిపోతుంటే... ఉక్క పోతలు భరించలేక అల్లాడుతుంటే వేళా పాలాలేకుండా విద్యుత్ శాఖ అధికారులు కోతలు వేధించటం దారుణమని ఆవేదన వ్యక్త చేశారు. ఇంత దారుణం గత ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదంటున్నారు. కరెంటు పోతుందని ఫిర్యాదులు చేస్తే కరెంట్ అన్నాక పోకుండా ఎలా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
కరెంటు పోయిన ప్రతిసారి అక్కడ మరమ్మత్తులు చేస్తున్నాం ఇక్కడ మరమ్మత్తులు చేస్తున్నామని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ముఖ్యంగా గుజ్జనగుండ్ల, కృష్ణ నగర్ ,విద్యానగర్, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ కోతలు దారుణాతి దారుణంగా ఉన్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి విద్యుత్ కోతలు ను అరికట్టాలని ప్రజల కోరుతున్నారు. మరోవైపు ఈ అప్రటికత కోతలపై అటు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.






