- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగని లీకులు.. MLA అరవ శ్రీధర్ మరో వీడియో వదిలిన వీణ
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ డెయిలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని వీణ అనే ప్రభుత్వ ఉద్యోగి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ డెయిలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని వీణ అనే ప్రభుత్వ ఉద్యోగి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు సార్లు శ్రీధర్ తనకు అబార్షన్ చేయించాడని వీణ సంచలన ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా అతడితో చేసిన చాటింగ్, మాట్లాడిన వీడియో కాల్స్ కు సంబంధించిన వీడియోలను సైతం ఆమె బయటపెడుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూపై వీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నేషనల్ మహిళా కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది.
ఇక మొన్న అసెంబ్లీలో కూర్చుని ఉన్న సమయంలో శ్రీధర్ తనతో వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ ను వీణ బయటపెట్టగా తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రీధర్ కారు నడుపుతూ ఉండగా వీణ అతడి పక్కనే కూర్చుంది. కారులో ఇద్దరూ గన్నవరం వెళుతున్న సమయంలో వీడియో తీసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా వీణ నవ్వుతూ మాట్లాడుతుండగా అరవ శ్రీధర్ మాత్రం సీరియస్ గా కారు నడుపుతున్నాడు. ఇదిలా ఉంటే వీణ చేస్తున్న ఆరోపణలపై రీసెంట్ గా శ్రీధర్ స్పందించాడు. ఇది తనకు ఆమెకు మధ్య జరిగిన విషయం మాత్రమే అని అన్నాడు. జనసేన పార్టీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇక ఇప్పటికే జనసేన పార్టీ కమిటీ శ్రీధర్ ను విచారించగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇంకా బయటకురాలేదు.






