ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి స్కూళ్లలో!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-23 02:41:43  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి స్కూళ్లలో!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం విద్యాశాఖ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమైనదని ఇటీవల విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న స్కూళ్లకు(School) ఒకే యాప్(App) ఉండేలా చర్యలు తీసుకోనుంది. విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాలు, మార్కులు, ఆరోగ్య సమాచారం పేరెంట్స్ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, బదిలీల వివరాలను పొందుపరుస్తారు. ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

Next Story