అనంతపురం సెంట్రల్ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత.. వీసీ కారును అడ్డగించిన విద్యార్థులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-17 16:46:58  IST  )

అనంతపురం సెంట్రల్ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది...

అనంతపురం సెంట్రల్ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత.. వీసీ కారును అడ్డగించిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం సెంట్రల్ వర్సిటీ(Anantapur Central University)లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్(Ladies Hostel)ఘటనపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీసీ కారును అడ్డుకున్నారు. వారంలోపు సమస్య పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చినా విద్యార్థులు ఆందోళనను వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేవరకు కదిలేదిలేదని కారు ఎదుట బైఠాయించారు. దీంతో విద్యార్థినులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తత మధ్యే వర్సీటీ వీసీ వేరే కారులో వెళ్లిపోయారు.

కాగా ఆదివారం మధ్యాహ్నం సమయంలో యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్‌లో ఆగంతకుడు చొరబడ్డారని, బాత్ రూమ్‌లో ఉన్న తమను తొంగి చూశాడని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఘటనపై కలెక్లర్, డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగానే విద్యార్థులు సోమవారం సైతం ఆందోళనను కొనసాగించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

Next Story