- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Thandel: మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్' మూవీ.. వీడియో షేర్ చేసిన నిర్మాత

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga chaitanya), హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్' (Thandel). మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకెళుతోంది. అయితే, సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ.. తండేల్ మూవీని సైతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పలాస నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ మూవీ ప్రదర్శించారు. ఏకంగా ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించటం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు.
ఇదివిచారణలో ఉండగానే.. తాజాగా మరోసారి తండేల్ మూవీని ఆర్టీసీ (RTC) బస్సులో ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిర్మాత బన్ని వాసు (Bunny Vasu) సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తండేల్ ప్రదర్శిస్తోన్న వీడియోను, ఆ బస్సు టికెట్‌ను షేర్ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. తమ సినిమా పైరసీని మరోసారి ఆర్టీసీ బస్సులో ప్రదర్శించినట్లు చెప్పారు. దీనివల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంతో మంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమేనని బన్నీ వాసు పోస్టులో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో ఇలా పైరసీ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించకుండా కఠినమైన సర్క్యులర్‌లను జారీ చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు విజ్ఞప్తి చేశారు.