- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సెల్ ఫోన్ కలకలం
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయ భద్రతా విభాగంలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కట్టుదిట్టమైన తనిఖీలు ఉంటాయని టీటీడీ బోర్డు చెప్తున్నప్పటికీ, ఒక భక్తుడు(Devotee) ఏకంగా సెల్ ఫోన్‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడం కలకలం రేపింది....

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ భద్రతా విభాగం(Srivari Temple Security Department)లో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కట్టుదిట్టమైన తనిఖీలు ఉంటాయని టీటీడీ బోర్డు(TTD Board) చెప్తున్నప్పటికీ, ఒక భక్తుడు(Devotee) ఏకంగా సెల్ ఫోన్(Cell Phone)తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడం కలకలం రేపింది. సదరు భక్తుడు కంపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలో తన మొబైల్‌తో ఏకంగా ఓ వీడియోను రికార్డు చేశాడు. అత్యంత సున్నితమైన, నిషేధిత ప్రాంతంలో తీసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
సెక్యూరిటీపై సర్వత్రా విమర్శలు
ఈ ఘటనతో తిరుమల విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులను పలు శ్రేణుల్లో తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ వస్తువులను స్కానింగ్ ద్వారా గుర్తించాల్సిన భద్రతా సిబ్బంది ఇక్కడ పూర్తిగా విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ భద్రతా లోపాలను సరిదిద్దడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువత్తాయి.






